- తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా హెల్త్ పెన్షన్ అమలు చేయాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ శనివారం ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, తీవ్ర కండరాల దుర్భలత లేదా ప్రమాదాల కారణంగా వీల్ చైరుకు, మంచానికి పరిమితమైన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 వేల రూపాయల హెల్త్ పెన్షన్ ను ప్రతినెల అందిస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా, డబుల్ ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4, నిరంతర మూత్రపిండాల వ్యాధి, తీవ్ర కుష్టు వ్యాధికి, తీవ్రమైన బోదకాలు, పోలియో వ్యాధి, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి అయిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్ తో సంబంధం లేకుండా ప్రతినెల 15 వేల రూపాయల పెన్షన్ తో పాటు, ఉచిత వైద్యాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సైతం ఇలాంటి హెల్త్ పెన్షన్ ను అమలు చేయాలని కోరారు.





