నేటి సాక్షి మెదక్ జిల్లా వెల్దుర్తి (భూమయ్య) : ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అన్నారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.ఆసుపత్రిలో పేషంట్ల హక్కులు, కర్తవ్యం వివరాలు తెలిపే బోర్డును ప్రదర్శించాలన్నారు. కలెక్టర్ వెంట వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





