Wednesday, April 1, 2026

మండల అభివృద్దే ఎమ్మెల్యే లక్ష్యం

  • కోదాడ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులకు 80 లక్షల నిధులు మంజూరు
  • కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి

నేటి సాక్షి కోదాడ (అనంతగిరి) : అనంతగిరి మండల సంక్షేమ,అభివృద్దే లక్ష్యంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పని వేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలలోని 20 గ్రామ పంచాయతీల మంజూరైన రూ. 80 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రోసిడింగ్ కాఫీలను ఆయన నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అనంతగిరి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఏడాది కాలంలోనే మండల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కే దక్కుతుందన్నారు. మండల ప్రజలు ఎప్పటికీ ఉత్తమ్ దంపతులకు రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. ప్రజా పాలనలో అభివృద్ధి,సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు.గుత్తేదారు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర పుల్లారెడ్డి, గునుకుల గోపాల్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వర్లు,డా.ముత్తినేని కోటేశ్వరరావు,డేగ కొండయ్య,జొన్నలగడ్డ కోటేశ్వరరావు, ఆనుమంతుల వెంకటయ్య, జ్ఞానేందర్ రెడ్డి, వేదాంతరావు,వేణు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News