Wednesday, April 1, 2026

ఘనంగా కాన్షిరం జయంతి వేడుకలు

  • చట్టసబల్లో ఎక్కువ శాతం బీసీలు ఉండాలన్నదే బిఎస్పి నినాదం

నేటిసాక్షి /వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీలో పరిధిలోగల కొప్పుసూరు గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్సీరాం జయంతి వేడుకలు మండల ప్రధాన కార్యదర్శి జనగం కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ఈసీ మెంబర్ కుమ్మరి సరబాబు పలువురు మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగం కేశవరావు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ బిజెపి ఒక్కటై అంబేద్కర్ ఆశయాలను ఆలోచన విధానాన్ని నశింపజేయాలని చూస్తున్నాయని పసిగట్టి అనేక ఉద్యమాలు నిర్వహించి. అత్యంత అతిపెద్దదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 100 సైకిళ్లతో యాత్ర చేసి ఇంటింటికి వెళ్లి సైకిల్ బెల్ కొట్టి బహుజన వాదాన్ని ఏనుగు గుర్తును పరిచయం చేసి మాయావతి అనే ఒక మహిళను నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా గెలిపించిన గొప్ప చరిత్ర కాన్షిరం ది అని అన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు అన్ని బహుజన వాదం చుట్టే తిరుగుతాయని బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేసిన ప్రతి వ్యక్తి పంచాయితీ ఆఫీసు నుండి పార్లమెంటు వరకు గెలుపు ఖాయమని కేశవరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కావిరి ముత్తయ్య, జనగం మానస, కుమ్మరి గౌరీదేవి, కుమ్మరి రాజాలు, సునీల్, అనిల్, సాకేత్, మోక్షితశ్రీ  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News