నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
జిల్లా కలెక్టరు ఆదేశనుసారం జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి పి. శ్రీనివాస్ రావు సూచన ప్రకారం ఈ రోజు మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాన్ని న్యూ కాకతీయ హై స్కూల్ హుజురాబాద్ లో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రములో ఎక్సైజ్ C. I టి. శ్రీనివాసులు, S.I లు T. వినోద్ కుమార్ బి. జుమ్ లాల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ కుమార్, ఉపాద్యాయులు మరియు ఎక్సైజ్ సిబ్బంది ముకుంద రెడ్డి, సంతోష్, శ్రవంతి పాల్గొన్నారు.





