- 150 టన్నుల అక్రమ ఇసుక స్వాధీనం, కేసు నమోదు
- అక్రమ రవాణాపై కఠిన చర్యలు – పోలీసుల హెచ్చరిక
నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటపల్లి గ్రామ శివారు శ్రీ రామాలయం వెనుక ఉన్న వెంచర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా 150 టన్నుల ఇసుక డంప్ చేసినట్లు నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, బెజ్జంకి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేయడం, పేకాట, జూదం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వ్యాపారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల నెంబర్లకు తక్షణమే సమాచారం అందించాలని కోరారు. 8712667445, 8712667446, 8712667447 సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయి అని అధికారులు స్పష్టం చేశారు.





