- ఎమ్మెల్యే ఆదిమూలం
- అభివృద్ధి పనులను పరిశీలించిన తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య ను కోరారు. శనివారం సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే ఆదిమూలం, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య, అధికారులతో కలసి పరిశీలించారు. పిచ్చాటూరు మండలం ఆరనియార్ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న లైట్ హౌస్ పనులను, సత్యవేడు లోని ఎన్.టి.ఆర్. పార్కు, వా నెల్లూరు వద్ద గల లే అవుట్ ను, వరదయ్య పాలెం వద్ద కాజ్ వే ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం అయినా సత్యవేడు అభివృద్ధికి తుడా నుండి నిధులు వెచ్చించాలని కోరారు. ముఖ్యంగా ప్రజలకు ఎంతో ముఖ్యమైన వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్.టి.ఆర్. పార్కుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాాతావరణాన్ని కల్పించాలని అన్నారు. లే అవుట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వరదయ్య పాలెం ప్రజలకు ఇబ్బందిగా మారిన కాజ్ వే నిర్మాణానికి సహకరించాలని కోరారు. పార్కుల్లో వాకింగ్ టాక్ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తామని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై పరిశీలన నిధుల సర్దుబాటు బట్టి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. తుడా కు ఆదాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ సందర్భంగా సురుటు పల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే, ఉపాధ్యక్షులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి, సి.పి.ఓ. దేవి కుమారి, ఈ.ఈ. రవీంద్ర, ఉద్యానవన శాఖాధికారి మాలతి, పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.





