- తడి, పొడి చెత్తను వేరు చేయాలి
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని 3వ వార్డులలో మున్సిపల్ కమిషనర్ వార్డులోని ప్రజలకు తడి, పొడి చెత్త గురించి పలు సూచనలు చేశారు. చెత్తను మురికి కాలువలో వేయరాదని హెచ్చరించారు. ఈ కారణంగా కాలువల్లో చెత్త పేరుకొని దోమలు ఈగలు, క్రిమి కీటకాలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఇంట్లో ఉండే తడి చెత్తను చెత్త బండికి వేయకుండా నేరుగా తీసుకువచ్చి మురికి కలలో పడవ వేస్తున్నారని, ఈ కారణంగా కాలువల దిగువ ప్రాంతంలో మురికి చేరుకొని కాలువలు నిండిపోతాయని, ఈ కారణంగా వ్యాధులు ప్రభలుతాయని ఆయన అన్నారు. అంట్ల ద్వారా వచ్చిన చెత్తను వడపోసి చెత్తను చెత్త బండికి అందించాలని చెప్పారు. మురికి కాల్వలలో చెత్తను వేసినట్లయితే వారికి జరిమాణాలు విధిస్తామని హెచ్చరించారు. విధిగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కే. సమ్మయ్యతోపాటు జవాన్ అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





