Monday, April 13, 2026

ఘనంగా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, కాన్షీరాం జయంతి

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ లో ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ మంద రాజు మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. విశారధన్ మహారాజ్ ల ఆదేశానుసారం సిర్సపల్లి క్రాస్ కాన్షీరామ్ విగ్రహ స్థలం వద్ద మండల కన్వీనర్ మంద రాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో బహుజన నాయకుడు సామాజికవేత్త కాన్షీరామ్ జయంతి మరియు ధర్మ సమాజ్ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవం రోజున కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంద రాజు మహారాజు మాట్లాడుతూ తెలంగాణ పీడిత ప్రజలు పడుతున్న అంతులేని దుఃఖానికి ముగింపు పలకాలంటే కాన్షీరామ్ ఖడ్గంతో యుద్ధం చేయాల్సిందేనని అప్పుడే అమ్ముడుకొని బిసి, ఎస్సి, ఎస్టీ సమాజం నిర్మాణం అవుతుంది. దళారులు నిర్మించబడతారు. నిజాయితీ నేతలు పైకి వస్తారు. కాన్షిరామ్ పోరాటం స్మరించుకుందాం. తెలంగాణలో కాన్షీరామ్ యుద్ధాన్ని కొనసాగిద్దాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు కండె తిరుపతి, సందెల వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, వేల్పుల రత్నం, తునికి సమ్మయ్య, సొల్లు బాబు, పంజాల రామశంకర్ గౌడ్, సతీష్ గౌడ్, అచ్యుత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News