- రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సహాయం
నేటి సాక్షి మహబూబాబాద్ భూక్యా రవి : కంబాలపల్లి వద్ద బండి నుంచి కిందపడి గాయపడిన ముస్లిం మహిళ ను చేరదీసి భీమా నాయక్(ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు)మానవత్వానికి మళ్లీ ఒక ఉదాహరణ నిలిచారు మానుకోటకు వస్తుండగా, దామరవంచ గ్రామానికి చెందిన యాకుబు భాష తల్లి రజియా బేగం ప్రమాదవశాత్తు కంబాలపల్లి వద్ద బండి నుంచి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలుపాలయ్యారు. ఎండ తీవ్రతకు ఆమె అచేతనంగా పడిపోయారు. ఎల్ హెచ్ పీ ఎస్ నేతలు వెంటనే స్పందించి సహాయం. అదే సమయంలో కంబాలపల్లి నుంచి మానుకోటకు వెళ్తున్న ఎల్ హెచ్ పీ ఎస్ నేతలు భీమ నాయక్, మంగీలాల్ నాయక్, లాకావత్ రామచందర్ నాయక్ అక్కడికి చేరుకుని మానవతా హృదయంతో స్పందించారు. ఎండలో అచేతనంగా ఉన్న ఆమెను నీడకు తీసుకెళ్లి, ఆమె పరిస్థితిని అంచనా వేసి తక్షణమే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు.
హాస్పిటల్‌కి తరలింపు – ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ మహిళ
అంబులెన్స్ తక్కువ సమయానికే అక్కడికి చేరుకుని గాయపడిన రజియా బేగంను సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు తగిన చికిత్స అందించారు. ప్రాణాపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశంసలు అందుకున్న ఎల్ హెచ్ పీ ఎస్ నాయకులు
సమాజంలో మానవత్వం ఇంకా జీవంతో ఉందని నిరూపించిన భీమ నాయక్, మంగీలాల్ నాయక్, రామచందర్ నాయక్ లాంటి నాయకులు అభినందనీయులు. ప్రజలు, స్థానిక పెద్దలు వీరి సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఈ సంఘటన మరెందరికైనా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సహాయసహకారమే మానవత్వానికి నిదర్శనం.
ఈ సంఘటన మళ్లీ ఒకసారి మానవ సహాయసహకారాల ప్రాముఖ్యతను చాటిచెప్పింది. సంఘంలో ఈ రకమైన సంఘటనలు మనిషి మనిషికీ అండగా నిలబడాలనే విషయాన్ని మరింత గాఢంగా తెలియజేస్తాయి.





