నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : గోదావరిఖని మార్కండేయ కాలనీలోని సాగరిక ఫర్నిచర్ మాల్ మొదటి వార్షికోత్సవం సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పరికిపండ్ల నరహరి, సందర్శించారు. బొంతల రాజేష్ కేక్ కట్ చేసి సాగరిక ఫర్నిచర్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ కి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. సారిక ఫర్నిచర్ మాల్ సంవత్సరకాలం పూర్తి చేసిన సందర్భంగా ముందుగా సంస్థకు కృషిచేసిన మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్, స్టాఫ్ కి కాంగ్రెస్ పార్టీ తరపున నా పక్షాన శుభాకాంక్షలు అని తెలిపారు. ఎక్కడలేని విధంగా హైదరాబాద్ ఐకియా ఫర్నిచర్ లాంటి షోరూంకు దీటుగా గోదావరిఖనిలో పెట్టినందుకు అభినందిస్తున్నానని, మీకు నచ్చిన విధంగా ఫర్నిచర్ కష్టమేషన్ చేసి హోల్సేల్ రేట్స్ కే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఖని కస్టమర్స్ కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ మాట్లాడుతూ… మా సంస్థ సాగరిక ఫర్నిచర్ మాల్ కస్టమర్స్ సహకారంతో సక్సెస్ ఫుల్ గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కస్టమర్స్ సహకారం ఉండాలని, ఇంకా సరసమైన ధరలో అతి తక్కువ ధరలో చాలా మోడల్స్ అండ్ వెరైటీస్ తేవడానికి కృషి చేస్తామని, హైదరాబాద్ ఐక్య షోరూం మోడల్స్ కి దీటుగా మీకు నచ్చిన విధంగా ఫర్నిచర్ కష్టమైజేషన్ చేసి హోల్సేల్ రేట్స్ కె ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, ఫణి, వెంకటేష్, ఖలీల్, షాప్ సిబ్బంది పాల్గొన్నారు.





