Monday, April 13, 2026

హాకీ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు):
హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున హుజూరాబాద్ లో నిర్వహించూచున్న హాకీ పోటీలను దృష్టిలో ఉంచుకుని హుజూరాబాద్ పట్టణ హాకీ ప్లేయర్లకు హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 35 మందికి డ్రెస్ లు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చైర్మన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు హుజూరాబాద్ లో జరగడం సంతోషంగా ఉందన్నారు. హుజూరాబాద్ క్రీడాకారులు రానున్న కాలంలో జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు కవిత నవీన్ కుమార్, బాపయ్య, సరళ, సతీష్, నరేష్, గోపి, నాయకులు బండ శ్రీనివాస్, తోట రాజేంద్ర ప్రసాద్, తాళ్లపెల్లి శ్రీనివాస్, గోవర్దన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News