

నేటి సాక్షి జమ్మికుంట : జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల నందు ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ జోగు సారంగపాణి గారికి ఘనంగా వీడ్కోలు మహోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మండల ఎంఈఓ హేమలత గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ప్రధానోపాధ్యాయులు దామెర సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా గత 36 సంవత్సరాలుగా సారంగపాణి సార్ గారు విద్యార్థులకు చేసిన సేవలను ఎంఈఓ మేడం గారు, మరియు ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గారు కొనియాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేషా చార్య గారు, సతీష్ గారు, సారయ్య గారు, ఎస్ రమాదేవి మేడం గారు, వెంకటేశ్వర్లు సార్ గారు, ఐలయ్య సార్ గారు, భాగ్యలక్ష్మి మేడం గారు, రమాకుమారి మేడంగారు, టి. శ్రీనివాస్ గారు, వీరాచారి గారు, శ్రీలత మేడం గారు, అశోక్ సార్ గారు,లావణ్య మేడం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య రూపకాలు ఆహుతులను బాగా ఆకర్షించినాయి.





