నేటి సాక్షి, వేమనపల్లి : మండలంలోని బుయ్యారం, జిల్లెడ, సూరారం, నాగారం గ్రామ పంచాయతీలో జరుగుతున్న నర్సరీ, కాంపౌండ్ వాల్, పశువుల పాక పనులను సోమవారం ఎంపీడీవో కుమార స్వామి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తీ చెయ్యాలని సూచించారు. నర్సరీలలో మొక్కల పెంపకం పట్ల నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ఆయన వెంట ఎం. పీఓ శ్రీనివాస్ రెడ్డి, ఈసి మధుకర్ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు,క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.





