- ఆర్ జి.-2 ఏరియా నుండి ఐ ఎన్ టు యు సి లో చేరికలు
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సోమవారం స్థానిక జనక్ భవన్ యందు ఐఎన్టియుసి ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సి.హెచ్. పి , ఓ. సి.పి -3 నుండి ఫోర్ మాన్ కార్మికులు వివిధ యూనియన్ ల నుండి పెద్ద మొత్తంలో జనక్ ప్రసాద్. నాయకత్వానికి ఆకర్షితులై ఐ. ఎన్. టు. యు.సి లో జాయిన్ అవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ , సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్, జనక్ ప్రసాద్. కండువా కప్పి సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్, జిల్లా అధ్యక్షులు దాస్, జాయింట్ జనరల్ సెక్రటరీ దేవులపల్లి రాజేందర్, గడ్డం కృష్ణ, దశరథం, సెంట్రల్ సెక్రటరీ అనుమాండ్ల నవీన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆర్జీ-1 సదానందం, మధు సిద్దోజీ, మల్లికార్జున్, సురేష్ , సంగని రవి కుమార్, కోల శ్రీకాంత్, ఓంకార్, కృష్ణా, శ్రీనివాస్,రైసుద్దీన్, సందీప్, ఇస్మాయిల్, వెంకటేశం, అరుణ్, శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





