Thursday, April 2, 2026

సైదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దాహనం

నేటి సాక్షి, సైదాపూర్: ఈరోజు స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ని తీవ్రంగా ఖండిస్తూ ఇది గౌరవ సభాపతి పట్ల చులకనగా మాట్లాడం, అలాగే ప్రజా సౌమ్యానికి అవమానకరంగా చాలా దురదుష్టకరంగా భావిస్తూ ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షులు వేముల సాయికుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బోనగిరి అనిల్ కుమార్, NSUI సైదాపూర్ మండల ఉపాధ్యక్షులు తలారి రోషన్, సైదాపూర్ మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి బానోతు తిరుపతి నాయక్, సైదాపూర్ మండల TPCC సోషల్ మీడియా కో – కోర్డినేటర్ మేదరి శ్రీరాఘన్, యూత్ కాంగ్రెస్ నాయకులు తిప్పరపు సాయికిరణ్, వేముల సాయిచరణ్, వేముల శివకృష్ణ, తీకుంట్ల రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News