Thursday, April 2, 2026

నేటి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేద్దాం

  • టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో (18-03-2025) మంగళవారం ఏర్పాటుచేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లాలోని జర్నలిస్టులందరు కుటుంబ సమేతంగా సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, మెడికల్ క్యాంపు నిర్వాహకులు బొడ్డుపల్లి లక్ష్మణ్, ద్యారపోగు మన్యం,కుమార్, గంధం దినేష్, తైలం అరుణ్ రాజ్ లు సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించ తలపెట్టిన ఉచితమేగా వైద్య శిబిరం చిట్యాల క్రాస్ రోడ్ లో గల దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు, 2డి ఎకో, ఈసీజీ, షుగర్, బీపీ, ఎత్తు, బరువు వంటి అనేక వైద్య పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి , జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గుండ్రాతి మధు గౌడ్ హాజరుకానున్నారని బొడ్డుపల్లి లక్ష్మణ్, ద్యారపోగు మన్యం,కుమార్, గంధం దినేష్, తైలం అరుణ్ రాజ్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News