Thursday, April 2, 2026

సిఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి నగరానికి చెందిన ముగ్గరికి సిఎం ఆర్ ఎఫ్ చెక్కుల్ని లబ్దిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం ఉదయం తన నివాసంలో అందచేశారు. ఎర్రమిట్టకు చెందిన ఆళ్ల రాజ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈయనకు ఏడు లక్షల రూపాయలు మంజూరు కాగా ఆళ్ల రాజ సతీమణి సుగణకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెక్ అందించారు. అలాగే ఆటోనగర్ కు చెందిన కిరణ్ కుమార్ లివర్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆయనకు రెండు లక్షలా ఐదు వేల రూపాయలు మంజూరు కాగా ఆయనకు చెక్కును ఎమ్మెల్యే అందచేశారు. అలాగే శ్రావణ్ కుమార్ కు యాభై ఆరు వేలు చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఎ నాయకులు మహేష్ యాదవ్, బాబ్జీ, సాయి, రూపేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News