
నేటిసాక్షి/మంగపేట : ములుగు జిల్లా కేంద్రంలోని భూక్య జంపన్న ఆఫీస్ నందు 12వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది శ్రీ సత్య కంటి ఆసుపత్రి డా,, అఖిల్ పర్యవేక్షణలో బీపీ, షుగర్ అత్యదునిక పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి శిబిరానికి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పేద ప్రజలు హాజరు అయ్యి తమ కంటి లోపాలను దాదాపు 250 పైచిలుకు ప్రజలు పరీక్షించుకోగా, వారిలో 39 మంది ప్రజలు కంటి సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు నిర్ధారించారు. ఆపరేషన్ నిమిత్తం వారికి మహబూబాబాద్ జిల్లా యందు సత్య కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. భూక్య జంపన్న మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మెగా హెల్త్ క్యాంపులో మెగా హెల్త్ క్యాంపులు, అలాగే ఉచిత కంటి వైద్య శిబిరాలు మరియు ఆరోగ్యపరమైన వివిధ క్యాంపులను గ్రామ గ్రామాన నిర్వహిస్తానని పేర్కొన్నారు.





