Thursday, April 2, 2026

2 లక్షల రుణమాఫీపై బిఆర్ఎస్&బిజెపి దుష్ప్రచారం మంత్రి శ్రీధర్ బాబు

  • రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగమే పరిశ్రమలు రాక మంత్రి శ్రీధర్ బాబు
  • నూతన వ్యవసాయ పద్దతులను కర్షకలోకానికి పరిచయం చేయాలి
  • ఒకేదఫాలో రూ.2లక్షల రుణమాపీపై టిఆర్ఎస్/బీజేపీ దుష్ర్పచారం
  • వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణస్వీకారంలో మంత్రి శ్రీధర్ బాబు
  • మార్కెట్ కమిటీలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చాం: కాంగ్రెస్ నేత కేఎల్ఆర్

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రైతులకు ఒకేదఫాలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఐటీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా దుష్ర్పచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తే కళ్లులేని కబోదిళ్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం ఆధారిత కొత్త పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి చెప్పారు. కొత్త పరిశ్రమలకు రంగారెడ్డి జిల్లా అన్నదాతల భూముల త్యాగమే ఇక్కడి అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…. వ్యవసాయ మార్కెట్ కమిటీలో అన్ని వర్గాలకు, కులాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని కేఎల్ఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగమే నేటి యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అన్నారు.
కొత్తకమిటీ కర్షకలోకానికి మంచి చేయాలని, అవగాహన పెంచాలని రైతుబిడ్డ లక్ష్మారెడ్డి చెప్పారు. అంతకు ముందు తుక్కుగూడలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కు ఘన స్వాగతం లభించింది.మహేశ్వరం పట్టణంలో స్వాగతతోరణం, కాంగ్రెస్ జెండాలు,వాహనశ్రేణితో భారీ స్వాగతం పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News