నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : మండలంలోని వెంపెట్ గ్రామములో ఆదివారం రాత్రి కుక్కల దాడిలో ఇరవై రెండు గొర్రెలు మృతి చెందినట్లు పశు వైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. గ్రామంలోని రాచర్ల అంజయ్య కు చెందిన గొర్రెలు ఇరవై రెండు కుక్కల దాడిలో చనిపోగ ఆరుగొర్రెలు గాయాలపాలు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేవిధంగా ప్రయత్నం చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల రెవన్యూ అధికారి కాంతయ్య, పశువైద్య సిబ్బంది బి.రవి,ఎస్. రమాదేవి, బి.మోహన్, బి.బుమాచారి, రైతులు నాయకులు రాములు, బద్దం స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





