- మహేశ్వరం మండల కేంద్రంలో ఆరవ రోజు రిలే నిరాహార దీక్షలు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఆరవ రోజు కొనసాగుతున్నరిలే గ్రూప్ నిరాహార దీక్షలు గ్రూప్ 1,2,3 ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు రావాలంటే మరో 10 ఏళ్లు పడుతుందని అప్పటి వరకు మాదిగలు నష్టపోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాదిగలకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 1, నియామకాలు వర్గీకరణ అమలు జరుగుతే మాదిగ 50 నుంచి 60 ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి మంచి మనసుతో అర్థం చేసుకుని గ్రూపు 1,2,3, నియమాకాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగలకు రావలసిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి ఇప్పటికే ప్రభుత్వం వర్గీకరణ లేకుండా డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాలో వర్గీకరణ అమలు లేకపోవడం వల్ల మాదిగలకు 11 వందల ఉద్యోగాలు రావాల్సి ఉండగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు 300 నుంచి 400 వరకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 700 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్, మాదిగ ఎమ్మార్పీఎస్ మహేశ్వర మండల ఇన్చార్జి బక్కని రవి, మాదిగ ఎమ్మార్పీఎస్ మహేశ్వర్ మండల అధ్యక్షులు ఎర్ర గణేష్, మాదిగ ఎమ్ ఎస్ వి మహేశ్వరి, మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ, మాదిగ మండల ప్రధాన కార్యదర్శి నడికుడా అర్జున్, మాది మాజీ మండల అధ్యక్షులు తొండ జంగన్న, మాదిగ పిల్ల శేఖర్, మాదిగ కుడుపు రాములు, మాదిగ ఆదిరాల స్వామి, మాదిగ వడ్డేమోని దాసు, మాదిగ ఆశపల్లి శంకరయ్య, మాదిగ తిరుమలి కృష్ణ, మాదిగ ఎర్ర శేఖర్, మాదిగ కొండని, మహేందర్ మాదిగ యాచారం నరసింహ, మాదిగ వడ్డేమాన్ ప్రదీప్ చంద్ర, మాదిగ తదితరులు పాల్గొన్నారు.





