Thursday, April 2, 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి కలెక్టర్

  • సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
  • ఈరోజు ప్రజావాణిలో 56 దరఖాస్తుల స్వీకరణ
  • మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నేటి సాక్షి మెదక్ జిల్లా, మెదక్, (భూమయ్య) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత అందించాలని, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కి వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చిన ప్రతి దరఖాస్తుదారుడికి జవాబుదారితనంతో పని చేయాలని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని, అధికారులు నాణ్యతతో కూడిన పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మనకు ప్రజావాణి కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ భూ లవాదేవీల సంబంధిత దరఖాస్తులు 19, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి-01 పెన్షన్ల మంజూరు దరఖాస్తులు-01, ఉద్యోగ ఉపాధి పై-02 ఇతర సమస్యలపై-33 దరఖాస్తుల మొత్తం 56 దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించడం జరిగిందని తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News