నేటి సాక్షి , మునగాల : మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయానికి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజుల లక్ష్మీనారాయణ సోమవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఒక లక్ష రూపాయలు విరాళం అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలియపరిచారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ. నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయమునకు దాతలు సహకరించాలని కోరారు. దేవాలయం కు విరాళాలు ఇచ్చే దాతలు రశీదు తీసుకోవాల్సిందిగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కేశగాని వెంకటేశ్వర్లు, వల్లపు రెడ్డి రామిరెడ్డి, కాసాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.





