నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మీచేడు నందు మాజీ ఆలయం కమిటీ చైర్మన్ సతీష్ బి కే ఎం ఆర్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే కి వాటర్ ప్లాంట్ యజమాని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ వెంకటేష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్, మాజీ కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకులు సాయి శ్యామ్ రెడ్డి, రాముడు, రాజు, రవి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





