Thursday, April 2, 2026

క్రమశిక్షణతో కూడిన చదువు ముఖ్యం

(నేటి సాక్షి: కరీంనగర్) : జడ్పీహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి. కే. శ్రీనివాస్ రెడ్డి గారు హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అత్యధికంగా కష్టపడి మంచి మార్కులతో ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తేవాలని సూచించినారు.ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో సమున్నతంగా ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన చదువు ముఖ్యమని తెలియజేశారు.
ఈ పాఠశాలకు గత 85 సంవత్సరాల నుండి మంచి పేరు ప్రఖ్యాతలతో ఉన్నటువంటి పాఠశాలను మీరు భవిష్యత్తులో అంతకంటే ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మీ యొక్క చదువు,ఆశలు, ఆశయాలు ఉండాలని ఆకాంక్షించినారు. అదేవిధంగా వెన్నంపల్లి పాఠశాల విద్యార్థులు జిల్లాల్లో మంచి మార్కులతో ఉన్నతంగా ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కేతిరి శ్రీనివాస్ రెడ్డి, టీ జయ గోపాల్ సింగ్, వి. ప్రవీణ్ కుమార్, కే.సత్యనారాయణ రెడ్డి జి. కుమార్ మరియు సత్య, జయప్రద, పద్మ, జ్యోతి, నలిని మేడం మరియు సిఆర్పి బి .రమేష్  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News