- బెజ్జంకి మండలంలో 6వ రోజు దీక్షలు
- బీఆర్ఎస్ పార్టీ,అంబేద్కర్ సంఘాలు సంఘీభావం
నేటి సాక్షి, బెజ్జంకి: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో, బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు సోమవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్, అంబేడ్కర్ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షులు దీటి బాలనర్సు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చేయకుండా గ్రూప్ ఫలితాలు విడుదల చేయడం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకుండా, మాల, మాదిగ అని కాకుండా, ఎవరికీ రావాల్సిన వాటా వారికే చెందే విధంగా వర్గీకరణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన నాయకులు నలువాల స్వామి, బిగుళ్ల మోహన్, లింగాల బాబు, బెజ్జంకి కిష్టయ్య, బెజ్జంకి శేఖర్, చింతకింది పర్శరాములు,మాంకాల బాలయ్య, మోదుంపల్లి రాజు, బోనగిరి చంద్రయ్య, మాతంగి బాబు, పొత్తురి మల్లేశం, లింగాల చిన్న బాబు, సోమిని బాలయ్య తదితరులు పాల్గొన్నారు.





