Thursday, April 2, 2026

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం – మల్లేశం, ప్రణవ్

  • గ్రంథాలయాల సమూల మార్పుకు శ్రీకారం
  • పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నాం.
  • హుజురాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.
  • కౌశిక్ రెడ్డి వార్డు మెంబర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ..
  • ఎమ్మెల్సీ, విప్ గా ఉన్నప్పుడు హుజురాబాద్ కు వెయ్యి కోట్ల నిధులు ఏందుకు తీసుకురాలేదు?
  • కౌశిక్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడిన ప్రణవ్..

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు):
రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు చేయూత అందిస్తున్నామని అలాగే హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తయారుచేస్తామని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయాన్ని స్ధానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ తో కలిసి సందర్శించారు. వసతులపై ఆరా తీశారు.1994లో మాజీ ఎంపీ స్వర్గీయ వొడితల రాజేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కాగా మరల ప్రణవ్ చేతుల మీదుగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇరువురు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మీడియా పాయింట్ వేదికగా ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి వార్డు మెంబర్ కి ఎక్కువ ఎమ్మేల్యే కి తక్కువ అని, హుజురాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థాయి గురించి మాట్లాడే కౌశిక్ రెడ్డి నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని, సొంత ఇమేజ్ తో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారని అది గమనించాలని హితవు పలికారు. ఇదే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏమన్నాడో సామాజిక మాధ్యమాల్లో ఇంకా ఉన్నాయని వాటిని గుర్తు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని, అప్పుడు మీ పరిస్థితి ఎంటో ఆలోచించుకోవాలని అన్నారు. ఇంకోసారి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే కమలాపూర్ లో పట్టిన గతే హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం పడుతుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెయ్యికోట్ల నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు?ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేయడం చేతకాక చేసేవారి మీద నిందలు వేస్తున్నడాని, అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని అన్నారు.

జర్నలిస్టులపై కౌశిక్ రెడ్డిది కపట ప్రేమ..

జర్నలిస్టుల గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, గతంలో హుజురాబాద్ లో రిపోర్టర్ ను బూతులు తిడుతూ, కొట్టిన వీడియోలు, రైతులను అధికారులను ఆన్న మాటలు సామాజిక మాధ్యమాల్లో ఇంకా ఉన్నాయని కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి జర్నలిస్టు సంఘాలకు తెలుసు అని అన్నారు.

సిఎంఆర్ఎఫ్,కల్యాణ లక్ష్మి చెక్కులు లాప్స్ అవుతున్నాయి..

అభివృద్ధిపై సోయిలేని కౌశిక్ రెడ్డి కనీసం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి కూడా ఆలోచించడంలేదని సకాలంలో పంచాల్సిన సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక్క రోజు ముందు పంచితే లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం, మేము ఆలోచిస్తే తన రాజకీయ లబ్దికోసం పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News