- ముగిసిన హాకీ టోర్నమెంట్..
- బహుమతులు ప్రధానం చేసిన ప్రణవ్.

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న హాకీ టోర్నమెంట్ ముగిసింది. చివరి రోజున జరిగిన మ్యాచ్ లో మెదక్, నిజామాబాద్ జట్లు తలపడగా మెదక్ జట్టు విజేతగా నిలవగా, నిజామాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచింది, హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు. గెలిచిన విజేతలకు ప్రణవ్ బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హుజురాబాద్ వేదికగా అనేకరకమైన క్రీడా టోర్నమెంట్ లు జరగాలని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో విద్యా, వైద్యంతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, మైదానాలకు సరిపడా నిధులు కేటాయిస్తామని తెలిపారు. హాకీ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులను ప్రణవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.







