- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ( కోక్కుల వంశీ ) : కుక్క కాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపరచగా,దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లితండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.





