నేటి సాక్షి, వీణవంక:
అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం (మార్చ్ 20) సందర్భంగా జీవ వైవిద్యం లో భాగంగా పిచ్చుకల సంరక్షణ కోసం విద్యార్థులకు చిత్రలేఖనం, పిచ్చుక గూడు నిర్మాణం (nest making) వివిధ అంశాలలో సృజనాత్మక పోటీలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీణవంక మండలానికి చెందిన జడ్పీ హెచ్చెస్ పోతిరెడ్డీ పల్లి విద్యార్థి దుర్గం ప్రహర్ష తన సైన్స్ ఉపాద్యాయులు నాత రాజేష్ మార్గదర్శకత్వం లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెస్ట్ మేకింగ్ లో విద్యార్థి ప్రతిభను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ నివేదిత విద్యార్థి దుర్గం ప్రహార్ష ను అభినందించారు.





