
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జగిత్యాల్ డిఎస్పి రఘు చందర్ సూచనలతో గొల్లపల్లి మండలంలో గల మోడల్ స్కూల్ లో అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి నిర్వహించిన కార్యక్రమానికి ధర్మపురి సిఐ ఏ. రామ్ నర్సింహారెడ్డి మరియు గొల్లపల్లి ఎస్సై చిర్రా సతీష్ పాల్గొని ధర్మపురి సిఐ మాట్లాడుతూ మహిళలు చిన్నపిల్లలు పట్ల జరుగు నేరాలు, ఈవ్ టీజింగ్, షీ టీం యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ 1930 రోడ్డు భద్రత, డయల్ 100, కమ్యూనిటీ పోలీసింగ్, గురించి వివరిస్తూ,ఎవరైనా చిన్న పిల్లలు, మహిళలు, మరియు వృద్ధుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్య తీసుకోబడునని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకర రవి, మోడల్ స్కూల్ సిబ్బంది. పోలీస్ కళాబృందం, షీ టీం సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.





