Thursday, April 2, 2026

ఇంటర్ వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మందమర్రి:- ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, త్రాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళే సమయంలో తనిఖీలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రంలోనికి మొబైల్, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని, తనిఖీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసర వైద్య సేవలు నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆయా రూట్లలో సమయానుసారంగా బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఎటిసి) పనులను సందర్శించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తహశిల్దార్ కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి వివిధ ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా నిబంధనలకు లోబడి జారీ చేయాలని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల పథకంలో ఎంపికైన అర్హత గల లబ్దిదారులకు తహశిల్దార్ సతీష్ తో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం సారంగంపల్లి గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఎండా కాలం కావడంతో మొక్కలకు సకాలంలో నీటిని అందించాలని, విత్తన అభివృద్ధి చర్యలు సక్రమంగా చేపట్టాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి మొక్కలకు ఎండ నుండి రక్షణ కల్పించాలని తెలిపారు. డంపింగ్ యార్డును సందర్శించి ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు పర్యవేక్షించాలని, తరలించిన చెత్త నుండి ఉపయోగకరమైన వ్యర్థాలను వేరు చేసి కంపోస్ట్ షెడ్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆదిల్ పేటలోని డంపింగ్ యార్డును సందర్శించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరీక్షించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. విద్యార్థులు ఆంగ్లంలో నైపుణ్యత పొందే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక విధానాలను అవలంభిస్తూ విద్యాబోధన చేయాలని తెలిపారు. విద్యార్థులను పాఠ్యాంశాలలో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. పొన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, 10వ తరగతి పూర్తి అయిన అనంతరం ఆసక్తి ఉన్న విద్యా రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పొన్నారం గ్రామపంచాయతీ, మందమర్రి మున్సిపల్ కార్యాలయాలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, గుత్తేదారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్-2020 పథకంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హుల వద్ద నుండి రుసుము వసూలు చేయాలని, ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ విషయంపై ప్రజలలో అవగాహన కల్పించాలని, ఆస్తి పన్నును 100 శాతం వసూలు చేసి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాయలింగు, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పాఠశాలల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News