నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో పెద్దపల్లి జిల్లా, రామగుండం, జ్యోతినగర్ పట్టణానికి చెందిన సిలివేరి గట్టయ్య (గణేష్) లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో PHD చేసి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా రామగుండం బిజెపి నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. సిలివేరి గట్టయ్య (గణేష్) లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో PHD చేసి డాక్టరేట్ పట్టా పొందడం గర్వకారణంగా భావిస్తున్నాము అన్నారు. ప్రొఫెసర్ డా. J. వివేకవర్ధన్. పర్యవేక్షణలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ స్పెషల్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై విస్తృతమైన పరిశోధనలు పూర్తి చేసి సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయడంతో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో PHD పట్టా అందజేయడం జరిగింది అన్నారు. సిలివేరి గట్టయ్య విజయం రామగుండం పట్టణానికే గర్వకారణమన్నారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో సాధించిన విశేష విజయం భవిష్యత్తులో మరెందరికో స్ఫూర్తి కలిగించనుందన్నారు. ప్రస్తుత యుగంలో సమాచార వనరులు లైబ్రరీల ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో, సిలివేరి గట్టయ్య. పరిశోధన తెలంగాణలోని ప్రత్యేక గ్రంథాలయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనీ పరిశోధన ఫలితాలు భవిష్యత్తు గ్రంథాలయ నిర్వాహకులకి, సమాచార వనరుల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. గట్టయ్య విజయాన్ని రామగుండం పట్టణంలోని విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలతో స్వాగతించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు క్యాతం వెంకటరమణ,తోట కుమారస్వామి, గుండెబోయిన లక్ష్మణ్ మరియు మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, పల్లికొండ నర్సింగ్, సిలువేరు అంజి, దెబ్బట కమల్ , గొర్రె రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.





