Thursday, April 2, 2026

2024-25 రబీ సీజన్ కు సంబంధించి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం కలెక్టర్ తన చాంబర్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలు పై సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 రబీ సీజన్ కు సంబంధించి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఆయా గ్రామాల పరిధిలో ధాన్యం ఉత్పత్తిని బట్టి గ్రామంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, సన్న రకం ఎన్ని పెట్టాలి, దొడ్డు రకం ఎన్ని పెట్టాలి అనేది పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్ ల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రాల్లో టెంటు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యంలో తాలు లేకుండా చేసేందుకు ఫ్యాన్ కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతిరోజు రిజిస్టర్ మైంటైన్ చేయాలని, రైతులు ధాన్యం తెచ్చిన రోజు నుంచి ఏ ఏ రోజుల్లో ఎంత తేమ శాతం ఉంది అనే విషయాలు రిజిస్టర్లలో రాయాలని చెప్పారు. మార్చి 25 లోపు బరువు కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మిషన్లు అందుబాటులోకి తెచ్చుకోవాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా, ఏఈఓ లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు సన్న రకం ధాన్యాన్ని గుర్తించే విధానంపై ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా, రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే వారికి ధాన్యం కేటాయించడం జరుగుతుందని, బ్యాంకు గ్యారంటీలు ఇవ్వని వారికి ధాన్యం కేటాయించడం ఉండబోదని స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, డిఆర్డిఓ ఉమా దేవి, పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డి.యం. సివిల్ సప్లై జగన్ , జిల్లా సహకార శాఖ అధికారి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News