Thursday, April 2, 2026

ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి

  • జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి తహసిల్దార్ లు, ఎంపీడీవోలు వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేయబడిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకో వాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పై అవగాహన కల్పించాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఇసుక విషయంలో తహసిల్దార్లు ఎంపీడీవోల ద్వారా వచ్చిన ప్రొఫార్మాకు అనుగుణంగా వారికి దగ్గర్లో ఉన్న రీచ్ నుంచి ఇసుక తీసుకు నేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఈ నెలాఖరులోపు మార్కింగ్ చేసుకోవాలని, వాళ్ళు వచ్చారా త్వరగా మార్కింగ్ చేసుకుంటేనే మొదటి విడత పేమెంట్ లబ్ధిదారులకు చేరుతుందని అవగాహన కల్పించాలన్నారు. ఇంటి నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా నగదు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఉపాధి హామీ పనులు చేసే పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, చలువనీడ సహా ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలను ఆదేశించారు. అదేవిధంగా లేబర్ టర్న్ అవుట్, యావరేజ్ ఏజ్ రేట్ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, పర్వతాలు, వెబ్ ఎక్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News