నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో సి సి రోడ్లు 50 శాతం పూర్తి చేశారు గతంలో 25 ఏళ్లు గడచిన ఎస్సీ కాలనీలో ఎలాంటి సిసి రోడ్లు లేని పరిస్థితి ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో గ్రామానికి సిసి రోడ్లు మంజూరు కావడంతో కొండాపురం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పవన్ కుమార్ ఎమ్మెల్యే ఆదేశానుసారంగా సీసీ రోడ్ల కాంట్రాక్టు పట్టుకొని పందెంకోడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సిసి రోడ్లు మంగళవారం పుర్తి చేశారు అదే విదంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి చర్చి వరకు ఎమ్మెల్యే ఆదేశానుసారంగా కొండాపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ నర్సిరెడ్డి సీసీ రోడ్లు కాంట్రాక్టు పట్టుకొని మంగళవారం అంబేద్కర్ చౌరస్తా నుంచి చర్చి వరకు సిసి రోడ్లు పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొండాపురం గ్రామ ప్రజలు 25 ఏళ్ల తర్వాత సిసి రోడ్లు పూర్తి కావడంతొ ఆర్షం వ్యక్తం చేస్తున్నారు..





