Thursday, April 2, 2026

రసమయి ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నం

  • బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన
  • పోలీసులు అడ్డుకొని అరెస్ట్

నేటి సాక్షి, బెజ్జంకి: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై ఎల్ఓసి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ లో అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్య ఆరోపణలు చేశాడని బుధవారం మండల కేంద్రంలో ఆరు మండలాల పార్టీ  అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షుల ఆధ్వర్యంలో   నిరసన కార్యక్రమం చేపట్టారు. పదేళ్లు అధికారులు ఉన్న రసమయి బాలకిషన్ గుండారం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైనారని ఆరోపించారు. ఎల్ వో సి ప్రభుత్వ హాస్పిటల్ లో మాత్రమే ఇస్తారని విషయం తెలియక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అక్రమాలు జరిగితే నిరూపించాలని సవాల్ చేస్తే చర్చకు రాలేదని  విమర్శించారు. కార్యకర్తలు రసమయి ఫామ్ హౌస్ ముట్టయించే ప్రయత్నం చేయగా, పోలీసులు బెజ్జంకి మండల కేంద్రంలో నాయకులను, కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.నిరసన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, ఏఏంసి చైర్మన్ పులి కృష్ణ,ఎస్ ఎల్ ఎన్ గౌడ్, పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మొరంపల్లి రమణారెడ్డి, గోపగోని బసవయ్య, బొంపల్లి రాఘవరెడ్డి, నాయకులు చెప్యాల శ్రీనివాస్ గౌడ్, అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, బైర సంతోష్ కుమార్, మిట్టపల్లి చెన్నారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News