Thursday, April 2, 2026

10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం

  • వివిధ సంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసిన విద్యార్థిని విద్యార్థులు..

నేటి సాక్షి , మునగాల : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరసింహుల గూడెంలో పదవ తరగతి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. వీడ్కోలు సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కష్టపడి చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. పరీక్షల్లో అక్షర దోషాలు లేకుండా అందంగా రాయాలని పరీక్షల మేలుకువలనను విద్యార్థులకు తెలియజేశారు. లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి అధికంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం అంగరంగ వైభవంగా జరిగిన సంస్కృతిక కార్యక్రమాలలో కొలహాలంగా విద్యార్థిని, విద్యార్థులు పాటలు కళా నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News