Friday, April 3, 2026

నా వార్డు ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం

  • యువ నాయకుడు ఎం.ఏ. ఫెరోజ్

నేటి సాక్షి, జమ్మికుంట :
జమ్మికుంట పట్టణంలోని 7వ వార్డు రైల్వే ట్రాక్ కాంపౌండ్ కి ఆనుకోని ఉన్న ఇండ్ల పక్కన విపరీతమైన చెట్ల పొదలు ఎపుగా పెరగడం వలన చెత్త చేదారం తో పాటు పందులకు, దోమలకు, విష కీటకాలకు నివాసంగా మారినందువలన గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇట్టి విషయం పై యువ నాయకుడు ఫెరోజ్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కి పరిస్థితి విన్నవించగా వెంటనే స్పందించిన కమిషనర్ జేసీబీని పంపి చెట్ల పొదలు మరియు చెత్త చెదారం శుభ్రం చేయించడం జరిగింది. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకరావాలని కోరిన ఫెరోజ్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదైన పని ఉంటే తన సహకారం ఎల్లప్పుడు వార్డు ప్రజలకు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఫెరోజ్ వార్డు ప్రజలకు ఉపయోగ పడే అనేక పనులలో ముందుండి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని వార్డు ప్రజలు కొనియాడారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News