- శివ కళ్యాణ రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్




నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని, భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ పవిత్రమైన మహోత్సవాల్లో పాల్గొనడం ఆయనకు గొప్ప ఆనందంగా మారింది. భక్తుల నినాదాలతో మారుమ్రోగిన వేములవాడ వీధుల్లో, రథోత్సవం భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.





