నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు చేతుల మీదుగా శివాజీ మొబైల్ షాప్ ప్రారంభోత్సవం జరిగింది. హుజురాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా మొబైల్ హార్డ్వేర్ రంగంలో ప్రవేశించి ఎంతోమంది మొబైల్ కష్టమర్లకు సాంకేతిక సేవలందించి వంగ ప్రవీణ్ శభాష్ అనిపించుకున్నాడు. హుజురాబాద్ పట్టణ పరిసర గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వినియోగదారులకు అందుబాటులో ప్రవీణ్ 2004 లో కంప్యూటర్ ద్వారా మొబైల్ రిపేర్ సెంటర్ ని స్థాపించి ఎంతో ఘనత సాధించాడు. వృత్తి పేరుని మొబైల్ పార్క్ ప్రవీణ్ ఇంటిపేరుగా కీర్తి గడించాడు. ప్రవీణ్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎంతోమంది యువత మొబైల్ షాప్ రంగంలో అడుగుపెట్టి జీవనోపాధిని పొందుతున్నారు. తన వంతు చేయూతగా కస్టమర్లకే కాకుండా ఆయా షాపుల వారికి కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సేవలను అందిస్తూ ఉన్నాడు. కొంతకాలం విరామం తర్వాత నూతనంగా మళ్ళీ మొబైల్ రంగంలో శివాజీ మొబైల్ పేరుతో హుజురాబాద్ విఫనిలోకి ప్రవేశించాడు. అత్యాధునిక పరికరాలతో, టెక్నాలజీతో మార్కెట్లో వస్తున్న అన్ని గ్యాడ్జెట్ లను అతి సులువుగా రిపేర్ చేయగల సామర్థ్యంతో తన మిత్రుడు రాజుతో మరో ముందడుగు వేశాడు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సురేష్, చారి, రాము, సునీల్, మొబైల్ యూనియన్ సభ్యులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.





