Friday, April 3, 2026

ఆసిఫాబాద్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి

  • జిల్లాలో జాబ్ మేళా కు విశేష స్పందన
  • జీవితంలో ఏ ఉద్యోగం చేసిన క్రమశిక్షణ ముఖ్యం

నేటి సాక్షి కొమురంభీం : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఫాక్స్ కాన్ సంస్థ వారి మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశిష్ట స్పందన లభించిందని అన్నారు , 10th క్లాస్, ఇంటర్మీడియేట్ , పాలిటెక్నీక్ మరియు ఏదైనా డిగ్రీ, పి.జి, పూర్తిచేసిన నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు మెరుగైన జీవితం కల్పించాలని ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా లో చదువుకున్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగిగా మిగలకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జీవితంలో ఏ పని లేదా ఉద్యోగం చేసిన క్రమశిక్షణ కలిగి ఉండడం ముఖ్యమని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి లక్షణాలను కలిగి ఉండాలని అన్నారు. ఎంత పెద్ద స్థాయికి చేరిన వ్యక్తి అయినా కూడా మొదట ఎన్నో కష్టాలను అనుభవించి తన పనిలో లేదా ఉద్యోగంలో అనుభవాన్ని పొంది, గొప్ప స్థాయికి చేరిన వారేనని అన్నారు. జీవితం ఉన్నతంగా ఉండడానికి స్కిల్స్ నేర్చుకోవాలని, అందరూ తమ తమ నైపుణ్యాలను మెగుపరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ కాన్ సంస్థ వారు , ఆసిఫాబాద్ నియోజకర్గ బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News