- సింగరేణి లో గనుల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఏఐటియుసి.
- కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఒక రోజు నిరహారదీక్షల్లొ పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించిన సీతారామయ్య
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని వికె 7ఓసి, సత్తుపల్లి ఓసి లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టు కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారదీక్షలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య దీక్షల్లో పాల్గొన్న పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ… 2015 లో కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టంలో మార్పులు చేయడం వల్ల దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్ లను వేలం ద్వారా ప్రైవేటు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సింగరేణి లో కొత్త గనులు రావడం లేదని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కి చెందిన రెండు బొగ్గు గనులను సంస్థ కు ఇవ్వకుండా సింగరేణి ని వేలంలో పాల్గొననీయకుండ అనుయాయులకు ఇచ్చిందని అన్నారు. ఇట్టి గనులను దక్కించుకున్న వాటిని ప్రారంబించలేదని అన్నారు, ఎందుకంటే ఎల్లందు ఏరియా ట్రైబల్ ఏరియా 1/70 చట్టం ఉందని దాని ప్రకారం ప్రభుత్వానికే ఆ గని దక్కుతుందని అన్నారు. తెలంగాణ లో ఉన్న కొత్త గనులను ప్రైవేటు కు కాకుండా సింగరేణి కి ఇవ్వాలని ఏఐటియుసి పోరాటం చేస్తుందని అన్నారు. వికె 7ఓసి జేకె ఓసి లో బొగ్గు తీసే పనిని యాజమాన్యం కాంట్రాక్టు కు ఇవ్వడాన్ని ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. 2000 సంవత్సరం లో ఎల్లందు కోయగూడెం ఓసి లో ప్రైవేటు చెందిన సర్ఫేస్ మైనర్ కు వ్యతిరేకంగా 13 రోజులు ఏఐటియుసి గుర్తింపు సంఘంగా ఉండి సమ్మె చేసి దానిని రద్దు చేయించి కంపెనీ ఉద్యోగుల తో బొగ్గు తీసే పనిని ఒప్పందం చేయడం జరిగిందని అన్నారు. యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బొగ్గు తీసే పనిని కాంట్రాక్టు కు కాకుండా సింగరేణి ఉద్యోగులే తీసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే సమ్మె కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వంగ వెంకట్, మల్లికార్జున్, రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.





