
నేటి సాక్షి, మెట్ పల్లి : జిల్లా కలెక్టర్ జి. సత్యప్రసాద్ ఆదేశాలతో పట్టణ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఐదు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మోహన్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చలి వేంద్రం ఏర్పాటు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎండాకాలం దృశ్య ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు చలి వెంద్రాలను సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, టిపిఓ రాజేంద్రప్రసాద్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, టిఎంసి సోమిడీ శివ, ప్రగతి, రమ్య,ముజీబ్, నరేష్, మహిళా సంఘం సభ్యులు బబ్బురి లక్ష్మి, చెరుకూరి పద్మ, శ్రీలత, కార్యాలయ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.





