Friday, April 3, 2026

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

  • పురుగు మందుల దుకాణాల తనిఖీ చేసిన భీమినీ ఏడీఏ సురేఖ

నేటి సాక్షి, వేమనపల్లి : ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని భీమిని డివిజన్ వ్యవసాయ సహాయక సంచాలకులు ఎల్తురి సురేఖ అన్నారు. మండలంలోని పురుగుమందుల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ. దుకాణాల యజమానులు వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి కలిగిన ఉత్పత్తులు మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు అమ్మరాదని, అమ్మిన ఉత్పత్తులకు నగదు బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన ఉత్పత్తులకు సంబంధించి నగదు బిల్లులు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. పురుగు మందులు నియంత్రణ చట్టం ప్రకారం వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని డీలర్లను హెచ్చరించారు. ప్రతి డీలర్ స్టాకు రిజిస్టర్లు,బిల్లు పుస్తకాలు సక్రమంగా రాసి ఉంచుకోవాలని డీలర్లను ఆదేశించారు. స్టాక్ బోర్డ్ మరియు ధరల పట్టిక రాసి పెట్టుకోవాలన్నారు. లైసెన్స్ వివరాలు కనపడేలా దుకాణంలో ప్రదర్శించాలని సూచించారు. వీరితో మండల వ్యవసాయ అధికారి వీరన్న ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News