నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం మంద కృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధించాడంతో కొడిమ్యాల మండల మాదిగ జేఏసీ సభ్యులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మండల నాయకులు ప్రజలు విద్యార్థులు పౌరులు పాల్గొన్నారు.





