Friday, April 3, 2026

ఘనంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వేడుకలు

నేటి సాక్షి వీణవంక: వీణవంక మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణను ఘనంగా డీజే పాటలతో, బస్టాండ్ ఆవరణము నుండి శివాలయ టెంపుల్ వరకు  బైక్ ర్యాలీతో స్వాగతించి, రెండు దేవాలయాలకు వాటర్ రిఫ్రిజిరేటర్లు, ప్రారంభించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి పేద విద్యార్థులకు సుమారు పదిమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడంతోపాటు పేద కుటుంబాలకు రెండు బస్తాల బియ్యం అందించి, దాదాపు 200 నుండి 300 మందికి డయాబెటిస్ ఉచిత చెకప్ చేయించడం, దీనితోపాటు మందులు కూడా ఇవ్వడం జరిగింది. వీణవంక మండలంలోని వికలాంగుల సంఘానికి 14 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది . ఈ సందర్భంగా వీణవంక జోన్ చైర్మన్ రామిడి శ్రీధర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ వీణవంక మండలానికి రావడం వారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేయడం మా వీణవంక వాసవి క్లబ్, వనిత క్లబ్, జమ్మికుంట వి కె ఎస్ పి వారికి ఎంతో సంతోషంగా ఉంది . రాబోయే రోజులలో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపడతామని హర్షం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో వాసవి క్లబ్, వనిత క్లబ్, నడికుడ కొత్త క్లబ్బులు కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ ఇంచార్జ్ పవిత్రం శ్రీనివాస్, గవర్నర్ ఇల్లందుల కిషోర్, రీజినల్ సెక్రటరీ నూక కృష్ణ, ఆర్.సి ఐత రమాదేవి, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు చిట్టిమల్ల హరిబాబు, అయిత స్వాతి, శ్రీనివాస్, రమేష్, వీణశ్రీ, జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ లెంకలపల్లి శరత్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News