
నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణ శ్రీ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన అధ్యక్షులుగా కొండ మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీనిలో భాగంగా గురువారం సంఘ అధ్యక్షులుగా కొండ మురళి ఒక్కరే నామినేషన్ వేయగా కార్యదర్శిగా ఇంద్రాల ఈశ్వర్ ఒక్కరే నామినేషన్ వేశారు.దింతో అధ్యక్ష, కార్యదర్శి లు ఏకగ్రీవం ఆయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను సంఘ సభ్యులు అభినందించి శాలువాతో సన్మానం చేశారు. తమను ఏకగ్రీవం చేసిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు .





