నేటి సాక్షి, జమ్మికుంట : పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలంలో గల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్నానం చేస్తుండగా డ్యామ్ లో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సాగర్ల సుధాకర్ లక్ష్మీ దంపతుల కుమారుడు సాగర్ల సాయి తేజ (19) అనే విద్యార్థి హైదరాబాదులో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు డ్యాములో జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.





